ఈ మధ్య కాలంలో సడెన్ గుండె పోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. డ్యాన్స్‌లు చేస్తూ గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య వందల్లో ఉంది. తాజాగా, గణతంత్ర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయ్‌చూర్ జిల్లాలోని సింధనూరు తాలూకా, దిద్దిగి గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహంతేశ్ అనే […]