ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు దక్కించుకున్నారు మంత్రి రోజా. సినిమాల్లోనే కాక.. బుల్లితెర, ఇటు రాజకీయాల్లో కూడా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తూ.. ఏ రంగంలో అయినా సరే తనకు తిరుగులేదు అనిపించుకుంటున్నారు రోజా. వైసీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రోజా. ప్రస్తుతం ఏపీ టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజాకు మరో పదవి దక్కింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రోజాకు అవకాశం లభించింది. […]
ఒలింపిక్స్ జరిగినా, కామన్ వెల్త్ జరిగినా, ఇంకోటి జరిగినా.. మన దేశానికొచ్చే పథకాల సంఖ్య మాత్రం రెండంఖ్యల్లోనే. 140 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో ఎందుకిలా జరుగుతుందా అంటే.. ఇన్నాళ్లు మన రాజకీయ నాయకులు క్రీడాకారులను ప్రోస్థహించరుగా అనుకునేవాళ్లం. కానీ, అది కొంతవరకే నిజం అనిపిస్తోంది. కొందరు మూర్ఖత్వపు అధికారులు/ అధికారిణులు.. క్రీడా కారులను బానిసలుగా మార్చుకుంటున్నారు. ఇన్నాళ్లు ఇంటి పనులకు వాడుకుంటున్న సంఘటనలు అనేకం జరగగా, ఇప్పుడు ఏకంగా మసాజ్ లు చేయించుకున్న ఘటన బయటకొచ్చింది. […]