తొలి రెండు టెస్టుల్లో స్పిన్ మాయాజాలంతో ఆసీస్ పతనాన్ని శాసించిన భారత్, మూడో టెస్టులో ఆదే స్పిన్ ఆడలేక కళ్లు తేలేశారు. ఆసీస్ స్పిన్ త్రయం మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీలను ఎదుర్కోలేక మ్యాచునే అప్పగించారు. ఆనాటి నుండి ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనల కంటే అత్యధికంగా చర్చ జరుగుతున్నది పిచ్‌ల మీదనే. నాగ్‌పూర్, ఢిల్లీతో పాటు ఇటీవలే ముగిసిన ఇండోర్ పిచ్ మీద జరగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇంకా మొదలుకాని అహ్మదాబాద్ పిచ్ గురించి కూడా శూల శోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశంలో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లకు ఆద్యం పోసింది.. తయారుచేయమని చెప్పింది మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని అని మాజీ పిచ్ క్యూరేటర్ దల్జిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.