ప్రస్తుతం కోవిడ్ -19 పరిస్థితులను, ప్రజల భయాందోళలను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఎస్‌ఎంఎస్ వర్మ్ అనే మాల్‌వేర్ ద్వారా సైబర్ కేటుగాళ్లు ఇండియాలోని ఆండ్రాయిడ్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్‌వేర్ ప్రభావంతో కొందరు నెటిజన్లు నకిలీ కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వారి వ్యక్తిగత సమాచారం అంతా ఇచ్చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు వరదలా వచ్చే సోషల్ మీడియా/ఆన్‌లైన్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ […]
కరోనా పై పోరాటంలో చివరి అస్త్రంగా భావిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ దేశంలో అందరికీ అందించే విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మెల్లగా ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలో అందుబాటులో ఉన్న కోవాక్సిన్, కోవీ షీల్డ్ టీకాలకు తోడుగా రష్యా నుంచి స్ఫుత్నిక్ వి వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ ‘స్పుత్నిక్’ ను ప్రయోగించింది. అందుకు గుర్తుగా రష్యన్ గవర్నమెంట్ కరోనా […]
కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ తాకుతోంది. ఇలాంటి సమయంలో వ్యాక్సినే రక్ష. 60 ఏళ్లు పైబడినవారికీ, 45 ఏళ్లు దాటినవారికీ కేంద్రం ఇప్పటికే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది.వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా, ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సిన్ సెంటర్లను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, వ్యాక్సిన్లు అందించడానికి కంపెనీలు సిద్ధమైనా, వాటిని కొనుగోలు చేసి ఉచితంగా ఇవ్వడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావడం లేదు. ప్రతి డోస్‌కు […]
మన దేశంలో ఒక్కో చోట ఒక్కో రూపంలో విలయతాండవం చేస్తోంది. సునామీలా విరుచుకుపడుతూ ప్రజల ప్రాణాలను బలికొంటోంది. సెకండ్ వేవ్ లో దేశంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో భారీగా నమోదవుతున్నాయి. పది శాతంపైన పాజిటివ్ రేటుతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కొద్దిగా వెనకా ముందు అయినా మహమ్మారి అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో ప్రాంతాలవారీగా పలురకాల కొవిడ్ వైరస్ రకాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఉత్తరాదిలో ఒక రకం.. దక్షిణాదిలో మరో రకం వైరస్ […]
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, ఫైజర్-బయోనోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను బ్రిటన్లో పెద్ద ఎత్తున అందిస్తున్నారు‘సింగిల్ డోస్’ కరోనా వ్యాక్సిన్ మన దేశంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిని కోరుతూ అంతర్జాతీయ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసింది. దాంతో పాటు వ్యాక్సిన్ దిగుమతి లైసెన్స్ కూ అనుమతి కోరింది. దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీని విజ్ఞప్తి చేసింది.విదేశీ వ్యాక్సిన్లకు వేగంగా అనుమతులు మంజూరు […]