ప్రముఖ బిజినెస్ టైకూన్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ(93) ఇకలేరు. సోమవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో పల్లోంజీ మిస్త్రీ తుది శ్వాస విడిచారు. ఆయన నిద్రలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్‌లో పల్లోంజీ మిస్త్రీ 18.4 శాతం వాటాతో అతి పెద్ద వ్యక్తిగత వాటాదారుగా ఉన్నారు. పల్లోంజీ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే.. 1929లో జన్మించిన ఆయన ముంబైలోని కేథడ్రల్ & జాన్ కానన్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత లండన్‌లోని ఇంపీరియల్ […]