ప్రాణం నీటి బుడగలాంటిది. ఎప్పుడు ఎలా కాలం తీరుతుందో తెలియదు. అనుకోకుండా చోటు చేసుకునే ప్రమాదాలతో కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటుంది. ప్రమాదాల్లో బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, తల్లి దండ్రులను పోగొట్టుకున్న పిల్లలు, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబసభ్యులు తీవ్ర దుఖంలో మునిగిపోతారు. అప్పటి వరకు తమతో ఉన్న వారు ఒక్కసారిగా ప్రాణాలతో లేరు ఇక తిరిగి రారు అని తెలిస్తే వారి కుటుంబసభ్యులు ఎంతటి క్షోభకు గురవుతారో ఊహకందని పరిణామం. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న కోరమండల్ రైలు ప్రమాదంలో గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ తండ్రి తన కొడుకు కోసం శవాల మధ్య వెతుకుతు కన్నీటి పర్యంతమైన తీరు ప్రతిఒక్కరిని కలచివేస్తుంది.