వెధర్ రిపోర్ట్- మొన్న ముంచుకొచ్చిన గులాబ్ తుఫాను నుంచి తేరుకునేలోపే మరో తుఫాను దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందినట్లు భారత వాతవరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫానుకు షహీన్ అనే పేరును పెట్టారు. ప్రస్తుతం ఈ తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 15 కిలో మీటర్ల వేగంతో పయనిస్తోందని ఐఎండీ స్పష్టం చేసింది. గుజరాత్ లోని దేవ్ భూమి ద్వారకకు 700 కిలోమీటర్లు, తూర్పు నైరుతిగా ఇరాన్ […]