హైదరాబాద్-చెన్నై- జై భీమ్.. తమిళ హీరో సూర్య నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలుసిందే. దళితులు, సంచార జాతులపై పోలీసుల దాడులు, అరాచకాలను జై భీమ్ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. తన భర్త కోసం ఓ పేద దళిత మహిళ పోరాటాన్ని సహజసిద్దంగా తెరకెక్కించిన జై భీమ్ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. జస్టిస్ చంద్రు జీవితంలోని ఓ యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన జై భీమ్ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. […]