టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఒక్క వెలుగు వెలిగారు రాకేష్ మాస్టర్. ఈ నెల 18న అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రఫర్లుగా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ లు రాకేష్ మాస్టర్ శిష్యులే.
టాలీవుడ్ ఇటీవల ఓ మంచి డ్యాన్స్ మాస్టర్‌ను కోల్పోయింది. ఆయనే రాకేష్ మాస్టర్. విజయనగరంలో షూటింగ్ నిమిత్తం వెళ్లిన అధికంగా మద్యం సేవించడంతో పాటు ఎండలో ప్రయాణించడంతో వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురై చనిపోయారు.