సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క-సారక్క జాతర.ఈ వనదేవతల జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతుంటారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘ మాసంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఈ జాతరకు కులమతాలకు అతీతంగా భక్తజనం తరలివస్తారు. తెలంగాణవ్యాప్తంగా ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి తరలివస్తుంటారు. కాగా, ఈ మహాజాతర విశిష్టతను […]