వేద సాయిచంద్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారుడు, జానపదగేయాలను కూడా ఆలపించేవాడు. సాయిచంద్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తన గానంతో ప్రజలను ఉత్తేజపరిచాడు. తన పాటలతో ప్రజలను ఉత్తేజపరిచేవాడు. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొని తెలంగాణ ప్రజలకు ఉద్యమస్ఫూర్తి రగిలించాడు.
సాయిచంద్ గారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కోటిన్నర రూపాయలతోపాటు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రజిని సాయిచంద్ గారిని సీఎం కేసీఆర్ నియమించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ప్రముఖ ఫోక్ సింగర్, బీఆర్ఎస్ నేత సాయిచంద్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తీవ్ర దుఃఖం అనుభవిస్తున్న ఆయన సతీమణి గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారు.