హైదరాబాద్- ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లోని తన నివాసంలో శనివారం ఉదయం రోశయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆస్పత్రికి వెళ్లే క్రమంలో మార్గ మధ్యలోనే రోశయ్య చనిపోయారు. ఈమేరకు స్టార్ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. రోశయ్య పార్ధివదేహాన్ని తిరిగి కుటుంబ సభ్యులు […]