ఎడ్లబండి.. ఇది ఒకప్పటి రైతు రథం. కాలుష్యం అంటే ఏంటో తెలియని రోజుల్లో పచ్చని పల్లెటూర్లలో ఈ రథం కళకళలాడుతూ తిరిగేది. పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా, పండగలైనా, జాతరైనా, సినిమాలైనా.. వేడుక ఏదైనా గానీ దొడ్లో ఉన్న ఎద్దులు బయటకు రావాల్సిందే. బండికి చిడతలు పెట్టాల్సిందే, ఎద్దులని కట్టాల్సిందే, పొరుగూరికి పోవాల్సిందే. అదీ ముచ్చట. ఇప్పుడు ఈ ముచ్చట లేదు గానీ అక్కడక్కడా కొన్ని మారుమూల గ్రామాల్లో ఎడ్లబండ్లయితే ఉన్నాయి. ఇప్పటికీ పండిన పంటను ఎడ్లబండి మీదే తరలించే […]