కర్ణాటకలో ఈ నెల 10 న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. మే 13న ఫలితాలు వెలువడున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు హూరాహూరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. కర్ణాటకలోని మాండ్య, హుబ్బళ్లి - ధార్వాడ్ జిల్లాలలో ప్రధాని.. రూ.16వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించడం ఇది ఆరోసారి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మాండ్యలో ప్రధాని రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేయనున్నారు.