నేటికాలంలో స్వార్థ పరుల సంఖ్య పెరిగిపోతుంది. ఎదుటి వారికి కష్టాలు వస్తే పట్టించుకునే వారే ఉండరు. కొందరు మాత్రం మానవ సేవయే మాధవ సేవ అనే మాటను బలంగా నమ్ముతారు. అందుకే కష్టాల్లో ఉన్నా వారికి సాయం చేస్తుంటారు.
మనం ఇతర ప్రాంతాలకు వెళ్లనప్పుడు హోటల్ లో గదులు తీసుకుంటాము. అయితే కొన్ని చోట్ల హోటల్ గదుల అద్దెలు సాధారణంగా ఉంటే .. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చుక్కులు చూపిస్తాయి. ఇక పెద్ద పెద్ద హోటల్ లో గదుల అద్దెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పశ్చిమ బెంగాల్ లోని ఓ మినీ హోటల్ లో కేవలం 20 రూపాయిలకే రూమ్ లభిస్తుంది.
శారీరక అవయవాలు అన్ని సరిగా ఉంటేనే పనిచేసేందుకు కొన్ని సందర్భాల్లో సాకులు చెబుతూ ఉంటాం. అమ్మ అడిగినా, నాన్న ఏమన్న తెమ్మన్నా కాకమ్మ కబుర్లు చెబుతుంటాం. కొంచెం కష్టానికే ఏంటిరా బాబు ఈ బతుకు అని విరక్తి మాటలు మాట్లాడుతాం. ఈ కష్టాలు ఎవ్వరికీ రాకూడదు రా అని బాధపడిపోతాం. మరి కొంతమందైతే నిరాశ, నిస్పృహలోకి వెళిపోతుంటారు. చదువులో ఫెయిలైనా, ఉద్యోగం దొరక్కపోయినా, చివరాకరు పెళ్లి కావట్లేదన్న సమస్యను భూతద్దంలో చూసి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. […]