నిత్యానంద.. ఒకప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక నటి రంజితతో నిత్యానంద రిలేషన్ గురించి బోలేడు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా రంజిత తండ్రి అశోక్.. కుమార్తె, నిత్యానంద బంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
సీనియర్ నటీనటులంతా ఇటీవల మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. కొంత మంది పాత తరం నటులు ఏమయ్యారో కూడా తెలియదు. అటువంటి వారిని వెలుగులోకి తెస్తూ.. వారితో ఇంటర్వ్యూలు చేస్తోంది సుమన్ టీవీ. తాజాగా మరో సీనియర్ నటుడు అశోక్ కుమార్‌ను అభిమానుల ముందుకు తీసుకు వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సినిమాల్లో నటించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆయన కుమార్తెనే నటి రంజిత.