సర్ఫరాజ్ ఖాన్ గురించి ఎవరికీ పెద్దగా పరిచయం ఉండదు. ఐపీఎల్ లో ఆడింది ఏమి లేదు. టీమిండియా నుంచి కూడా పిలుపు రాలేదు. కానీ ప్రస్తుతం ఈ బ్యాటర్ వైరల్ అవుతున్నాడు. జాతీయ జట్టులోకి రావడానికి అన్ని అర్హతలు ఉన్నా ఇప్పటివరకు ఈ ఆటగాడిని ఎందుకు సెలెక్ట్ చేయడం లేదో పెద్ద ప్రశ్నగా మారింది. తాజాగా వెస్టిండీస్ జరగబోయే సిరీస్ లో కూడా తనకు చోటు దక్కకపోవడంతో సర్ఫరాజ్ సెలెక్టర్లకి పరోక్షంగా కౌంటర్ విసిరాడు.