న్యూ ఢిల్లీ– వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం అంతకంతకు ఉత్కంఠ రేపుతోంది. ఆయన అరెస్ట్, బెయిల్ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉండగానే కుటుంబసభ్యుల కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రఘురామ కృష్ణరాజుపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఆయన కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. రఘురామ కృష్ణరాజు సతీమణి రమాదేవి, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, […]