సమాజంలో మార్పు రావాలంటే.. ముందుగా మీ నుంచి మొదలవ్వాలి.. ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచ్ బాగా అర్థం చేసుకున్నాడు. ప్రంపచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యకు పరిష్కారం దిశగా తన వంతు కృషి చేశాడు. అతడి ఆలోచన అధికార యంత్రాంగాన్ని కదిలించింది. ప్రజల్లో మార్పు తీసుకువచ్చింది. ఏం జరిగింది అంటే..
ప్రతిభకు చదువుతో సంబంధం లేదు. ప్రస్తుతం సమాజంలోని చాలా ఆవిష్కరణలు చేసింది సామాన్యులు, గొప్ప చదువులు లేని వారంటే అతిశయోక్తి కాదు. మనిషి ఎదుర్కొనే సమస్యలే అతడి ఆలోచనా విధానాన్ని మార్చుతాయి. సమస్యకు పరిష్కారం వెదికే దిశగా చేసే ప్రయత్నాలే అద్భుత ఆవిష్కరణలకు దారి తీస్తాయి. ఈ కోవకు చెందిన సంఘటనే ఒకటి ఒడిశాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతలా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు […]