ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. ఈ విషాదంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిశ్రమ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగతోంది. ఈ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదం చోటు చేసుకోవడమే కాక.. దాని నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాల వల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆరేళ్ల వయసు నుంచే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. […]
రోజు రోజుకి కాలుష్యం ఎక్కువై పోతోంది. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం, వాహనాలు పెరిగిపోవడం, ఫ్యాక్టరీ లో ఉండే వ్యర్ధ పదార్ధాలని నదుల్లోకి వదలడం ఇలా అనేక కారణాల వల్ల కాలుష్యం బాగా పెరిగి పోతోంది. ఏది ఏమైనా వీటిని అదుపు చెయ్యాలి. లేదంటే ఎన్నో ప్రమాదాలు కలుగవచ్చు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ లో యమునా నది కాలుష్య కాసారంగా మారింది. దీనితో పవిత్రమైన నదులు కూడా వ్యర్థ పదార్థాల తో నిండి పోతున్నాయి. కేవలం అక్కడే […]
వాహనాలు, రోడ్లు, ఇతరత్రా కారణాల వల్ల నిత్యం గాల్లోకి 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పీఎం 10, పీఎం 2.5 అత్యంత ప్రమాదకరమైనవి. పీఎం 2.5 కంటికి కనిపించదు. తల వెంట్రుక మందం(50 మైక్రోగ్రాములు)లో 20వ వంతు ఉంటుంది. గాలి పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడే స్థిరపడి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఈ నేపధ్యంలో వాహన కాలుష్యం పరిమితిలోనే ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం (పీయూసీ) వాహనాలకి ఉండాలనే సంగతి తెలిసిందే. కాలుష్య పరీక్ష జాప్యం […]
న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు పర్యావరణ కాలుష్యంపై దృష్టి సారించాయి. ఈమేరకు ప్రదాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల స్క్రాపేజ్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పాలసీలను అనుసరిస్తున్నాయి. అందువల్ల ఇప్పటికీ పాతబడిన వాహనాలు వాడే వారు ఇక అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇకపై పాత వాహనాలతో రోడ్డుపైకి వెళ్తే జరిమానాలు కట్టాల్సిందే. అంతే కాదు ఆ వాహనాలను సీజ్ చేస్తారు కూడ. ఇందులో భాగంగానే […]
ఎపిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించాలని నెడ్‌క్యాప్ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో జులై మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా తొలిదశలో లక్ష వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా […]