రోజురోజుకీ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగితే పరిస్థితులు ఇంకా దిగజారొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్ల పైకి పెట్రోల్, డీజిల్ వాహనాలు రాకుండా సంచలన నిర్ణయం తీసుకుంది.
న్యూ ఢిల్లీ- దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనల రిజిస్ట్రేషలు నిలిపివేస్తున్నట్లు పెత్త ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం జరిగిన ఓ వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ వాహనాలను కొనుగోలు చేయడానికి అమ్మకాలను ప్రోత్సాహిస్తున్నట్లు చెప్పారు. అంతే కాదు విమానయాన ఇంధనంలో 50 శాతం ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు […]