బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లు కెరీర్ బిగినింగ్ లో మోడలింగ్ గా చేసి ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యారు. మిస్ ఇండియా, మిస్ యూనివర్సీ లుగా గెలుపొందిన వారు తర్వాత మోడలింగ్ లో అడుగు పెట్టి హీరోయిన్లుగా రాణించారు. శ్రీలంక కు చెందిన నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మోడలింగ్ లో రాణించి బాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది.
సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం.. దాంతో ప్రతీ ఒక్కరి చూపు సెలబ్రిటీస్ పైనే ఉంటుంది. వారు ఏం చేస్తున్నారు. ఎవరెవరిని కలుస్తున్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతుంటారు అభిమానులు. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్లు అభిమానులతో పాటుగా మరికొంత మంది సన్నిహితులతో ఫొటోలు దిగుతుంటారు. అలా ఓ వ్యక్తితో ఫొటో దిగడమే ఓ స్టార్ హీరోయిన్ కు ఇబ్బందులను తెచ్చింది. ఆ ఒక్క పిక్ కారణంగానే కేసులు ఎదుర్కొంటూ.. కోర్టుల చుట్టూ తిరుగుతోంది […]