వయసు 21 ఏళ్ళు. చదివింది బీటెక్. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తే జీతం లక్షల్లో వస్తుంది. కానీ తన ఆనందాన్ని నాలుగు గోడల మధ్య కాకుండా నాలుగు గోడల బయట చూసుకుంది. నాలుగు గోడల బయట అయితేనే తనకు ఆనందం దక్కుతుందని భావించి పానీపూరీ వ్యాపారం ప్రారంభించింది. అంత చిన్న వయసులో నెలకు 8 లక్షల నుంచి 9 లక్షలు సంపాదిస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఈమె ముందు దిగదుడుపే అనేలా ఆమె సంపాదన ఉంది. మరో విశేషం ఏంటంటే ఆమె బుల్లెట్ బండి మీద తిరుగుతూ పానీపూరీ అమ్ముతుంది.
ఉత్త్రర్ ప్రదేశ్- మన దేశంలో పెద్ద పెద్ద వ్యాపారులు చేసే వారికంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారే ఎక్కువ. బడా వ్యాపారులు కోట్లల్లో బిజినెస్ చేస్తే, చిరు వ్యాపారులు రూపాయల్లో బిజినెస్ చేస్తుంటారు. ఐతే చిన్న వ్యాపారులు కూడా బాగానే సంపాదిస్తుంటారని వేరే చెప్పక్కర్లేదు. చిన్న వ్యాపారాల్లోనే ఎక్కువ ఆదాయం ఉంటుందని చాలా సందర్బాల్లో నిరూపితం అయ్యింది. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర్ […]