ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలే తమకు తిరుగులేని కంచుకోట అని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైఎస్సార్సీపీ), తాజా పల్లె పోరులో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 39 శాతం ఓటు బ్యాంకును కలిగి ఉన్న ఆ పార్టీ.. తాజా పంచాయతీ ఎన్నికల్లో 24.6 శాతానికి పడిపోయినట్లు విశ్లేషణలు […]