ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు సేవచేయడానికి ఎన్నుకోబడిన వారు. అలా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తుంటారు ప్రజాప్రతినిధులు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రజలను నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇది కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రులకు, ముఖ్యమంత్రికి సైతం నిరసనలు ఎదురవుతుంటాయి. తాజాగా తమిళనాడు ఆర్ధిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ కారుపై కొందరు భాజపా కార్యకర్తలు చెప్పులు విసిరారు. ఈ వ్యవహారంలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధురైలో శనివారం చోటుచేసుకుంది. […]