17 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత.. పాక్ గడ్డపై అడుగుపెట్టి టెస్టు క్రికెట్ ఆడుతున్న ఇంగ్లండ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. టెస్టు క్రికెట్‌లో తొలి రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసి.. ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. 1910లో ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాపై సిడ్నీలో టెస్టు ఆడుతూ.. తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 494 పరుగులు చేసింది. తాజాగా ఇంగ్లండ్ 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. పైగా తొలి రోజు ఒక […]
ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది. బాంబు దాడుల భయంతో పాకిస్థాన్ వెళ్లేందుకు కొన్నేళ్లుగా అన్ని క్రికెట్ టీమ్స్ వణికిపోతున్న విషయం తెలిసిందే. అయితే.. పాక్ క్రికెట్ బోర్డు కాళ్లావేళ్లా పడటంతో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. గతేడాది పాక్ పర్యటనకు వచ్చింది. కానీ.. మ్యాచ్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందే భద్రతా కారణాల దృష్ట్యా, సిరీస్ రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్లిపోయింది. […]
మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత టీ20 ప్రపంచకప్ ఊహకందని ట్విస్టులతో సాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఓడి.. సెమీస్ ఆశలే లేని పాకిస్తాన్ ఫైనల్ లో తొలి అడుగు వేస్తే.. పడుతూ లేస్తూ సెమీఫైనల్స్ కు వచ్చిన ఇంగ్లాండ్ మరో అడుగు ముందుకేసింది. ఈ ఇరు జట్లు నవంబర్ 13న అమీ.. తుమీ.. తేల్చుకోనున్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. ప్రస్తుత ప్రపంచ కప్ విజేతను కాలమే నిర్ణయించిందా? అంటే నిజమేనేమో అనిపించక మానదు. 1992లో జరిగిన వన్డే వరల్డ్ […]
Pakistan Squad For T20 World Cup 2022: దాయాది పాకిస్తాన్.. టీ20 ప్రపంచకప్-2022కు జట్టును ప్రకటించింది. దాదాపు ఆసియా కప్ టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లనే మరోసారి కొనసాగించింది. ఎంపిక చేసిన 15 మందిలో ఆసియా కప్ లో విఫలమైన ఫకార్ జమాన్ కుచోటు దక్కకపోగా, గాయంతో టోర్నీలో దూరమైనా షాహీన్ అఫ్రిది తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక, సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు మరో అవకాశమిస్తుందని వార్తలొచ్చినా.. కనీసం స్టాండ్ బై ఆటగాడిగా కూడా […]
ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తోంది. అందులో భాగంగా గురువారం ఇంగ్లాండ్ ఆటగాళ్లందరూ కరాచీ విమానాశ్రయానికి చేరుకున్నారు. 2005 తర్వాత పాక్‌లో ఆంగ్లేయులు పర్యటించడం ఇదే తొలిసారి. గతేడాదే రావాల్సి ఉన్నా భద్రతా కారణాలతో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తప్పుకోవడంతో ఈసీబీ అదే దారిలో నడిచింది. ఇది తమను అగౌరపరచడమే అంటూ అప్పట్లో పీసీబీ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి పాక్ వేదికగా ద్వైపాక్షిక సిరీస్ నిర్వహిస్తున్నారు. […]