KCR: ప్రధాని నరేంద్ర మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని, ప్రజలను గాలికి వదిలేస్తున్నారని, తమకిష్టం వచ్చిన వారికి, కోటీశ్వరులకు, వ్యాపారులకు దేశ సంపదను దోచిపెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రజారాజ్యం.. రైతుల రాజ్యం రావాలని, ఈ దేశం కొత్త పుంతలు తొక్కాలని ఆకాంక్షించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. […]