నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారకరామారావు కోడలు, జయకృష్ణ భార్య అనారోగ్యంతో మరణించారు. ఎన్టీఆర్ అల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఈమె స్వయానా సోదరి కూడా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం తలెత్తింది. ఆయన రెండవ కుమారుడు నందమూరి జయకృష్ణ భార్య పద్మజ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. 73 ఏళ్ల పద్మజ గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఇవాళ ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆసుపత్రిలో చేర్చినా ఫలితం […]