హైదరాబాద్- ప్రముఖ జ్యోతిష్యులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇక లేరు. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన జ్యోత్యిష్య పండిత నిపుణులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ పంజాగుట్టాలోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐతే మార్గమధ్యలోనే రామలింగేశ్వర సిద్ధాంతి చనిపోయారని వైద్యులు చెప్పారు. పలు టీవీ కార్యక్రమాల్లో వార ఫలాలు చెబుతూ రామలింగేశ్వర సిద్ధాంతి తెలుగువారికి చేరువయ్యారు. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి చెప్పే రాశి ఫలాలను తెలుగు రాష్ట్రాలతో […]