ఈ మద్య మత్స్యకారుల వలలకు ఎన్నో చిత్ర విచిత్రమైన చేపలు చిక్కుతున్నాయి. కొన్ని చేపలు మత్స్యకారులకు కాసులు కురిపిస్తున్నాయి. మరికొన్ని చేపల వల్ల భారీ నష్టాన్ని చవిచూస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. విశాఖ రుషికొండ సమీప కార్తికవనం వద్ద సముద్రంలో మంగళవారం ఈ అరుదైన చేప వలలో పడింది. ఈ చేపను చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు. తల భాగంలో ముళ్లతో పెద్ద కళ్లతో విచిత్రంగా కనిపిస్తున్న సముద్రజీవిని […]