ఇటీవల తరచూ దేశంలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానయాన శాఖ అధికారులు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు బలవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఓ ఇంటిపై యుద్ధ విమనం కుప్ప కూలింది.
ఇటీవల భారత వాయుసేన విభాగంలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగ పలువురు పైలట్లు దుర్మరణం పాలవుతున్నారు. తాజాగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఒకటి రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. కూలిన మిగ్-21 విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు భారత వైమానిక దళం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. బార్మర్ జిల్లా సమీపంలో ఐఏఎఫ్ మిగ్-2 భీమ్డా గ్రామ సమీపంలో కూలిపోయినట్లు బార్మర్ […]