హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతున్న తరుణంలో దేశం నలుమూలల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతుండడంతో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతంది. ఈ సమస్యను తీర్చడానికి ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ తో పాటు ప్రభుత్వం కూడా పలు రకాల చర్యలు తీసుకుంటుంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్లైఓవర్ల నిర్మాణం, అండర్ వేస్ నిర్మించి ట్రాఫిక్ సమస్యను తీరుస్తున్నారు. దీంతో పాటు మెట్రోను నిర్మించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. అయితే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఊహించని షాక్ ఇచ్చింది.