గత కొన్నిరోజుల నుంచి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఏపీ, తమిళనాడుకి మరో తుఫాన్ రానుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అటు తమిళనాడు, ఇటు ఏపీ చిగురుటాకుల వణుకుతున్నాయి. తమిళనాడులో అయితే పరిస్థితి మరి ఘోరంగ ఉంది. జోరుగా కురుస్తున్న వర్షాలకు స్టాలిన్ ప్రభుత్వం స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. ఇదిలా ఉండగానే మరో తుఫాన్ దూసుకొస్తుందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడి, ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి […]