గడ్చిరోలి రూరల్- మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ తో మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. పోటేగావ్, రాజోలీ మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కమాండోలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఆ గాలింపు చర్యల్లో ఓ గ్రామానికి సమీపంలో మావోయిస్ట్‌ల స్థావరాన్ని కనుగొన్నారు. […]