ఐపీఎల్ జట్లలో వరుస కరోనా కేసులు నమోదవడంతో.. ఐపీఎల్ 2021 సీజన్‌ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా వచ్చే అత్యధిక ఆదాయం బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నుంచే వస్తోంది. ఐదేళ్లకాలానికి స్టార్ స్పోర్ట్స్ రూ.16,347 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.3,369.40 కోట్లని బీసీసీఐకి చెల్లించాల్సి ఉండగా.. ప్రతి మ్యాచ్‌కీ రూ.54.50 కోట్లని ఇస్తోంది. అయితే.. ఐపీఎల్ 2021 సీజన్‌లో కేవలం 29 మ్యాచ్‌లు […]