ఇండస్ట్రీలో సెలబ్రిటీల ఫ్యామిలీస్ గురించి తెలుసుకునే ఆసక్తి ఫ్యాన్స్ లో ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఎందుకంటే.. అభిమాన హీరోలను ఎలాగో సినిమాలలో చూస్తూనే ఉంటాం. అదే హీరోల ఫ్యామిలీస్ గురించి ఎప్పుడోసారి వింటూ.. ఏవైనా అకేషన్స్ జరిగినప్పుడు విష్ చేస్తుంటారు. తెలుగు ప్రేక్షకులకు మంచువారి కోడలు విరానికా గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె వ్యక్తిగత విషయాలు తెలియనప్పటికీ.. హీరో మంచు విష్ణు భార్యగా అందరికీ సుపరిచితమే.