ఐపీఎల్ మ్యాచ్ లో ఏం జరగాలనేది ముందే ఫిక్సవుతోందా? అంటే ఏమో చూస్తుంటే అలానే అనిపిస్తోంది బాబోయ్ అని అందరూ అనుకుంటున్నారు. తాజాగా లక్నో-రాజస్థాన్ మ్యాచ్.. ఈ డౌట్స్ రావడానికి కారణమైంది.
ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ మూడో విజయం సాధించింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ హెట్‌మేయిర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 36 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 సిక్సులు ఉన్నాయి. ముఖ్యంగా చివరి ఓవర్లలో లక్నో బౌలర్లను చీల్చిచెండాడు. హెట్‌మేయిర్ ఇంత హిట్టింగ్ చేయకముందే ఒక లైఫ్ దొరికింది. 14 బంతుల్లో కేవలం 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ […]