మద్యం అంటే చాలా మందికి అదొక ఎమోషన్. ఎప్పుడూ మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరే ఉంటారు. అలాంటి ఒక మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికి మద్యం, ఫర్నిచర్ మొత్తం దగ్ధమైంది.
మద్యానికి బానిసై అనేక మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. మత్తు కోసం కొంతమంది తాగుతుంటే, యువత మాత్రం ఏకంగా ఇదే నేటి తరం ఫ్యాషన్ అంటూ సీసాలు సీసాలు తాగేస్తున్నారు. దీనికి అలవాటు పడ్డ కొంతమంది భర్తలు కుటుంబాన్ని పిల్లలను పట్టించుకోకుండా ఇంట్లో విలువైన వస్తువులు ఏం కనిపించినా అమ్మటానికి కూడా వెనకాడని పరిస్థితులు ఉన్నాయంటే మత్తు ఎంత పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక భర్తల తాగుడుకు విసిగిపోయిన కర్ణాటకలోని 500 మంది మహిళలు పోరాటానికి […]