విమానంలో ఓ వ్యక్తి హల్‌చల్ చేయడంతో అమెరికాలోని మిన్నియాపోలీస్ విమానాశ్రయంలో జెట్‌బ్లూ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి మొదట ముఖానికి మాస్కు ధరించేందుకు నిరాకరించాడు. మాస్కు విషయమై విమాన సిబ్బంది అతడికి సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పక్కన కూర్చున్న ప్రయాణికురాలిని కౌగిలించుకోవడం, అసభ్యంగా తాకడం చేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆ వ్యక్తి ముక్కు వద్ద ఏదో తెల్లటి పదార్థం కూడా కనిపించింది. […]