శ్రీ మహావిష్ణువు యొక్క 23 అవతారాల్లో ఎనిమిదవ అవతారమే శ్రీ కృష్ణావతారం. శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవుడు దంపతులకు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోని అష్టమి నాడు(8వ రోజున) కంసుడి చెరసాలలో జన్మించాడు. శ్రీ కృష్ణుడి పుట్టినరోజునే కృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి రోజునే రోహిణి నక్షత్రం కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. నక్షత్రాలు, తిథులని బట్టే పూర్వం పుట్టినరోజులు, […]