ఆ మహిళకు ఉన్నట్లుండి ఏదో అయ్యింది.. శరీరరం ఆమె చెప్పిన మాట వినడం లేదు. తిందామని ముద్ద నోట్లో పెడితే.. నాలుక దాన్ని బయటకు తోస్తుంది.. కాళ్లుచేతులు ఆమె ప్రమేయం లేకుండానే కదలసాగాయి. విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్లు.. మహిళకు ఏమైందో అని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎందరు వైద్యులకు చూపించినా.. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. చివరకు మంత్రాలు చేయించారు.. తాయెత్తులు కట్టించారు.. దెయ్యం, గాలి సోకింది ఏమో అని భావించి.. భూత వైద్యులను కూడా […]
ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల కారణంగా పంట నష్టంతో ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఆహార కొరత ఆందోళన కలిగిస్తోందంటూ తాజాగా అధినేత కిమ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కిందటి ఏడాది తుఫానుల వల్ల చెలరేగిన వరదల కారణంగా వ్యవసాయ రంగం తగినంత ధాన్యం ఉత్పత్తి చేయలేకపోయిందని కిమ్ అన్నారు. ఉత్తర కొరియా దాదాపు 8 […]
ప్లాస్టిక్ కవర్లు.. డబ్బాలు.. బాటిళ్లు.. పొద్దున లేచిన దగ్గర్నుంచీ వాడే పాలప్యాకెట్ నుంచి సమస్తం ప్లాస్టిక్‌మయం. ఆ ప్లాస్టిక్ చెత్తంతా ఇలా నాలాల్లోకి చేరుతోంది. ఉందన్న విషయమే తెలియనంతగా ప్లాస్టిక్ చెత్త కప్పేసింది. ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలనే ప్రసంగాలు వినపడతాయి. కానీ.. తేదీ మారగానే ప్లాస్టిక్ సంగతీ అందరూ మర్చిపోతున్న పరిస్థితి. అలా కాకుండా ఇకనుంచైనా ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని భావితరాల వారికి […]