వెలాడుతున్న తోరణాలన్నీ కరెన్సీ నోట్లతో కట్టినవే.. అమ్మవారికి వేసిన దండలన్నీ డబ్బుతో అల్లినవే.. కిలోల కొద్దీ బంగారం, వెండి బిస్కెట్లతో అమ్మవారిని అలంకరించి, భక్తులకు కనుల విందును అందించారు. సింహపురి సీమలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారే ఈ కరెన్సీ మధ్యలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నుడా చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, […]