డిజిటల్ డెస్క్- ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కంగనా ట్విటర్ ఖాతాను శ్వాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ట్విటర్ తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేయడం ద్వారా ట్విటర్ నియమ, నిబంధనలను కంగనా ఉల్లంఘించారని ట్విట్టర్ స్పష్టం చేసింది. విద్వేషపూరిత, అసభ్య ప్రవర్తన కారణంగా కంగనా రనౌత్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. తాజాగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కంగన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. బెంగాల్ […]