అమ్మాయిలు తమ కురులు పొడవుగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అందుకోసం ఎన్నో చిట్కాలు, హెయిర్ స్టైలింగ్ పద్ధతులను పాటిస్తారు. ఈ క్రమంలో తమ కురులను అందంగా, ఆరోగ్యంగా మల్చుకోవాలని సెలూన్ల వైపు పరిగెడుతుంటారు. ఇప్పుడు ఇదంతా మనకెందుకు అంటారా.. దేశంలోనే అత్యంత పాపులర్ హెయిర్ స్టైలిస్ట్ అయిన జావెద్ హబీబ్ ఓ మహిళ హెయిర్ కట్ చేస్తూ నీటికి బదులు ఉమ్మి వాడడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగింది. […]