తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే హాస్యనటులకు పుట్టినిల్లు. ఏ భాషలో లేనంత మంది కమెడియన్స్ మన దగ్గరున్నారు. సినిమా ఏదైనా సరే వాళ్ల మొదటి లక్ష్యం ప్రేక్షకులని నవ్వించడమే. ఒకప్పటి రాజబాబు దగ్గర నుంచి ఇప్పటి వెన్నెల కిశోర్ వరకు మనకు ప్రతి సినిమాతోనూ నవ్విస్తూనే ఉన్నారు. ఇక సుత్తి వీరభద్రరావు అనే వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. 80-90 దశకంలో ఎన్నో హాస్యభరిత పాత్రలు పోషించారు. […]