ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్, దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే మరో ప్రముఖ నిర్మాత రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషాదాలతో సినీ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. డబ్బింగ్ చిత్రాల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న జక్కుల నాగేశ్వరరావు (46) ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో […]