హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ఉత్కంఠ నెలకొంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ మరింత సమయం కావాలని కోరింది. సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. […]