ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందులోనూ టాటా లాంటి కంపెనీలో జాబ్ అంటే కళ్ళు మూసుకుని చేరవచ్చు. మీరు కూడా ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ ఉద్యోగం మీ కోసమే. అనుభవం అవసరం లేదు. మీలో నేర్చుకోవాలన్న తపన ఉంటే కంపెనీనే మీకు శిక్షణ ఇచ్చి జాబ్ ఇస్తుంది. శిక్షణ కాలంలో నెలకు రూ. 30 వేలు ఉపకారవేతనం ఇస్తుంది.
కరోనా సెకెండ్ వేవ్ ఐటీ రంగంపై తాత్కాలిక ప్రభావాన్నే చూపింది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు భారత్ వైపు చూస్తున్నాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో మనవాళ్లు ముందుండటం కలిసొచ్చే అంశం. చాలామంది ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కొవిడ్-19 బారిన పడడంతో మొదట్లో ఇబ్బందులు ఎదురైనా, మళ్లీ పరిస్థితులు కుదుట పడ్డాయి. ఐటీ సంస్థలు కొత్త ప్రాజెక్టులు చేజిక్కించుకోవడం డిజిటల్‌కు పెరిగిన ప్రాధాన్యం నేపథ్యంలో నిపుణులైన […]