ఇటీవల తెలంగాణ లో ఖమ్మం బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరుకోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాయి గణేష్ పై పోలీసులు వేధింపులు దారుణంగా మారాయని.. ఇది భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. సాయి గణేష్ ఆత్మహత్య విషయం హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ ను […]