తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. 4,59,242 మంది పరీక్షలు రాయగా.. 2,24,012 మంది పాస్ అయ్యారు. ఇంటర్ ఫస్టియర్ లో 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపారు. […]